అమెరికా ఇండియన్ మూవీ బాక్సాఫీసు ట్రేడ్ నిపుణులు ‘అత్తారింటికి దారేది' చిత్రం రెండో రోజు 4 నుంచి 5 లక్షల డాలర్లు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. వీకెండ్ పూర్తయ్యే వరకు 2 మిలియన్ల యూఎస్ డాలర్లు వసూలు చేసే అవకాశం ఉందని అంటున్నారు
ఏపీ ఫస్ట్ డే షేర్ విషయంలో ‘అత్తారింటికి దారేది' సరికొత్త రికార్డు నెలకొల్పింది. తొలి రోజు రూ 10.6 కోట్ల షేర్ సాధించింది. గతంలో ఈ రికార్డు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన నాయక్ పేరు మీద ఉండేది. సంక్రాంతికి విడుదలైన నాయక్ తొలి రోజు రూ. 9.95 కోట్లు ఫస్ట్ డే ఏపీ షేర్ సాధించింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా స్టార్ రైటర్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై.లి.పతాకంపై భారీ చిత్రాల నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్‘అత్తారింటికి దారేది' చిత్రాన్ని నిర్మించారు. పవన్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటించారు. నదియా, కోట శ్రీనివాస్, అలీ, బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ తదితరులు నటించారు. ఈచిత్రానికి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : పీటర్ హెయిన్స్, ఆర్ట్ : రవీందర్, కో ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్. అత్యుత్తమ, నాణ్యమైన వార్తలను అందిస్తున్న వన్ఇండియా... ఇప్పుడు మీకోసం ఫేస్‌బుక్, ట్విట్టర్ ల ద్వారా మరిన్ని అప్‌డేట్స్
0 comments:
Post a Comment